కేరళకు చెందిన 11 మంది మహిళలు అదృష్టం వరించింది. అందరూ కలిసి రూ.250కు లాటరీ టిక్కెట్‌ను కొన్నారు. తాజాగా విడుదలైన లాటరీ ఫలితాల్లో రూ.10 కోట్లు గెలిచారు. పరప్పనన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తుంటారు. వీరికి రూ.10 కోట్ల విలువైన మాన్సూన్ బంపర్ లాటరీ దక్కింది.