ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన భర్తను గొడ్డలితో ముక్కలుగా నరికి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ పీలీభీత్ లో జరిగింది. శివనగర్ గ్రామంలో రాంపాల్ అనే వ్యక్తిని అతని భార్య దులారో దేవి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సోమవారం రాత్రి దారుణంగా హతమార్చింది. రాంపాల్ అదృశ్యంపై అతని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా భార్యే నిందితురాలని గురువారం తెలిసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.