మద్యం దుకాణంలో చొరబడిన ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజ్ బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర్లో ఉన్న మద్యం షాపులో ఓ దొంగ తాళం పగులగొట్టి ప్రవేశించారు. డబ్బుల పెట్టేను పగులగొట్టి అందులోంచి రూ.90 వేలు కొట్టేశాడు. యజమాని శుక్రవారం ఉదయం షాపు తెలిచినప్పుడు విషయం తెలిసింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని సంపాదించారు.