బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ పెరగడంతో అక్కడ బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. అక్కడ పెద్ద బియ్యం కంపెనీలన్నీ ధరలను అమాంతం పెంచేశాయి. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం పట్ల ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నట్లు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త ఒలివర్ గౌరించస్ తెలిపారు.