పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏకుల కోటి, ఏకుల సురేష్, మేకా కోటేశ్వరరావు, తురకా వజ్రయ్య, జెర్రిపోతు అశోక్, కురగంటి దయబాబు, నందిగం ముకుందరావు తదితరులు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలో లో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వ పనితీరుతోనే పార్టీలో చేరికలు పెరిగాయన్నారు.