హిందూపురం పట్టణంలో పట్టుగూళ్ల మార్కెట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన చలో విజయవాడ పోస్టర్లు శనివారం రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చలపతి, కనిశేట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎకరాకు పదివేలు సాగు సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఆగస్టు 7వ తేదీన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాట్లు తెలిపారు.