కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం ఉద్యమించాలని ఐఎఫ్టియూ జాతీయ ఉపాధ్యక్షుడు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని గాయత్రీ ఫంక్షన్ హాల్ (రామ కృష్ణారెడ్డి నగర్) లో జరిగిన ఐఎఫ్టియూ రాష్ట్ర వర్క్ షాప్ మరియు రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బి. సురేష్, ఎం. ఏసు స్థానిక నాయకులు చిన్నా ఏర్పాట్లను పరిశీలించారు.