మహిళల పోరుయాత్రలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఉమెన్స్ కాలేజీలో శనివారం జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జి. ప్రియాంక మాట్లాడారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి, నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.