ప్రస్తుతం విశాఖలో ప్రతీ నలుగురిలో ఒకరికి కళ్ల కలకల సమస్య ఎదురవుతోంది. ఇది సీజనల్ వచ్చే ఇబ్బంది. కనుక భయపడాల్సిందేమీ లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, నిరోధించవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంట్లో ఎవరికైన కళ్లు ఎర్రగా కనిపిస్తే వారి నుండి దూరంగా ఉండాలని, కళ్లకలకలు వచ్చిన వారి కళ్లను చూడకూడదని, డాక్టర్ ను కలిసి చుక్కల మందులు వేసుకోవాలని సూచించింది.