ఎలమంచిలి నరసింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య శనివారం చేసుకున్నాడు. ఎలమంచిలి మండలం కృష్ణాపురానికి చెందిన శిరసపల్లి శ్రీను (20) మతి స్థిమితం లేక చనిపోవాలనే ఉద్దేశంతో తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి తుని ఏరియా హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.