హిజ్రాలు తమ విలువల్ని కాపాడు కోవాలని బాధ్యతగా లేకపోతే సమాజం మిమ్మల్ని దరి చేరనీయదని విశాఖ జిల్లా ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ నోడల్ అధికారి దిశ విభాగ ఏసీపీ సీహెచ్ వివేకానంద పేర్కొన్నారు. ముర్గీమాతా పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త హిజ్రాలు విశాఖ చేరుకుని మూడ్రోజులుగా సమావేశాలు నిర్వహించుకున్నారు. శనివారం ముగింపోత్సవం సందర్భంగా శ్రీనివాసాకల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.