ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను పశ్చిమనియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సహకారంతో ఎంవిపి పోలీసులు కుటుంబ సభ్యులకు శనివారం రాత్రి అప్పగించారు. ఆర్ఆర్ వెంకటాపురంకు చెందిన గోవిందమ్మ(35) శుక్రవారం ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన ఆమె ఆచూకీ కనుకోవాలని పోలీస్ లకు తెలిపారు. దీంతో ఆమె ఆచూకీ లభ్యం కావడంతో ఆమెను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.