బాల గంగాధర్ తిలక్ 103వ వర్దంతి సందర్భంగా మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ నిర్వాహకులు లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డుతో మోదీని సత్కరించారు. అనంతరం ప్రసంగించిన మోదీ తన స్పీచ్‌ను మరాఠీలో ప్రారంభించారు. ముందుగా స్వాతంత్య్రయోధులు లోక్మాన్య తిలక్, సంఘ సంస్కర్త అన్నా భౌ సాథేకు నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు.