చైనా రాజధాని బీజింగ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి 11 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైపూన్ డోక్సూరి ఫలితంగా ఉత్తర చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దేశంలోని పలు ఫ్రావిన్స్ల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతాయని ప్రభుత్వం హెచ్చరించింది.