ఉమ్మడి ప్రకాశం జిల్లా, కందులూరు లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... కందులూరుకు చెందిన అనూషకు అదే గ్రామానికి చెందిన అంబటి అనిల్‌కుమార్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమారుడు అఖిల్, కుమార్తె అక్షర(8 నెలలు) ఉన్నారు. వీరి కాపురం కొంతకాలం క్రితం వరకూ సాఫీగానే సాగింది. అనంతరం అనిల్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. తప్పతాగి వచ్చి భార్యను హింసించడం ప్రారంభించాడు. తాగవద్దని ఆమె వేడుకుంటున్నా అతనిలో మార్పులేదు. దీంతో విసిగిపోయిన అనూష శనివారం ఎలుకలు చంపేందుకు ఉపయోగించే పేస్టును తన పిల్లలకు తినిపించడంతోపాటు తానూ తింది. దీంతో అస్వ స్థతకు గురైన వారిని అనూష తండ్రి ప్రసాద్ ఒంగోలులోని జీజీహెచ్‌లో చేర్పించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం సోమవారం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అక్షర మృతిచెందింది. తల్లీకుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.