టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనపై ప్రముఖులతో ఆయన చర్చించనున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. 4వ తేదీ రాత్రి ఆయన నెల్లూరుకు చేరుకుంటారు. 5వ తేది ఉదయం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తారు. అనంతరం జిల్లాలో పరిశ్రమల స్థాపన విషయమై పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు.