చిత్తూరు జిల్లాలో ఆగస్టు 4 నుంచి ప్రతి శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సమీక్షా సమావేశాలు జరుగుతాయని కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశాలకు జిల్లా మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొంటారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో 4వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కుప్పం నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుంగనూరు నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుంది. 11న ఉదయం పలమనేరు, మధ్యాహ్నం చిత్తూరు, 24న ఉదయం పూతలపట్టు, మధ్యాహ్నం గంగాధరనెల్లూరు నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షా సమావేశాలు జరుగుతాయని వివరించారు.