రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్ట్ 9 నుంచి నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరంలో రెండు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించగా, సెకండ్ కౌన్సెలింగ్‌లో మిగిలిన 580 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ట్రిపుల్ ఐటీ అడ్మి షన్ నోటిఫికేషన్‌ను జూలైలోనే విడుదల చేయటం, తొలివిడత కౌన్సిలింగ్‌ను పూర్తి చేయటం జరిగింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లకు గాను మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తిఅయ్యే సమయానికి 760 సీట్లు భర్తీ కాకపోవడంతో తిరిగి రెండో విడత కౌన్సెలింగ్‌ను ఆగస్ట్ 9 నుంచి నిర్వహించేందుకు యాజమాన్యం సెకండ్ కౌన్సెలింగ్ మెరిట్ లిస్ట్‌ను 4న విడుదల చేయనుంది.