వివేకా హత్య కేసులో జగన్ దంపతులను కాపాడటానికే ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం సీబీఐకి తాను చెప్పిన విషయాల నుంచి వెనకడుగు వేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఈ కేసులో అసలు హంతకులను కాపాడటానికి మొత్తం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, దుర్మార్గంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అజేయ కల్లం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి తదితరులను విచారిస్తేనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa