హర్యానాలో వీహెచ్పీ చేపట్టిన ర్యాలీపై కొందరు రాళ్ల దాడి చేయడంతో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు మరణించారు. ఇక తాజాగా ఈ అల్లర్ల కేసులో 116 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 29 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. మరోవైపు తాము చేపట్టిన ర్యాలీపై రాళ్ల దాడిని నిరసిస్తూ ఢిల్లీలో VHP నిరసనలకు పిలుపునిచ్చింది.