వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రుషికొండ బీచ్ లో బోటు షికారును ప్రస్తుతం నిలిపివేసినట్లు మంగళవారం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.సముద్రంలో అలల ఉధృతి తీవ్ర స్థాయిలో ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం దృష్టా అధికారుల ఆదేశాల మేరకు బోటు షికారు నిలిపివేస్తున్నమని, వాతావరణం అనుకూలించిన తర్వాత కొనసాగిస్తామని పేర్కొన్నారు.