శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ కియా ప్లాంట్ వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. "భావితరాలకు ఏం కావాలో ఆలోచించేది నా విధానం. విధ్వంసం చేయడం జగన్ విధానం. ఎవరైనా కియా మోటార్స్ వస్తుందనుకున్నారా... కలలో కూడా ఊహించలేదు. 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. బాలయ్య సాంగ్ పెట్టి డాన్స్ చేశారు. కియా ప్లాంట్ వల్ల 13000 మంది డైరెక్ట్ గా 50,000 మంది ఇన్‌డైరెక్టుగా ఉద్యోగాలు వచ్చాయి. ఐదు సంవత్సరాలు అయింది వైసీపీ అధికారంలోకి వచ్చి... ఒక రోడ్డు వేశారా.. ఒక ప్రాజెక్టు కట్టారా ఒక ఇండస్ట్రీ వచ్చిందా... చాలా పరిశ్రమలు ఇక్కడి నుంచి పోయాయి. జాకీ పరిశ్రమ పారిపోయింది. ఒకాయన ది గ్రేట్ ఎంపీ ఉన్నాడు. ఆయనను చూస్తే నాకే భయమేస్తుంది. ఎప్పుడు బట్టలు విప్పి రోడ్డు మీదికి వస్తాడు నాకే తెలియదు. బట్టలు విప్పేసి సరసాలు ఆడతారు. ఫోన్లో మాట్లాడుతారు. అలాంటి వెధవలంతా ఎంపీలు అయ్యారు. కియా పరిశ్రమ వద్దకు వచ్చి తుపాకీ చూపించి బెదిరింపులకు గురిచేస్తారు. మీ కథ తెలుస్తానని బెదిరిస్తారు. ఏం తెలుస్తావయ్య... వీడియోలు చూపించావు కానీ మీరందరూ అనుకుంటే బట్టలు విప్పి శాశ్వతంగా పంపిస్తాం. ప్రజలకు ఆశక్తి ఉంది తమాషా అనుకోవద్దు." అని చంద్రబాబు హెచ్చరించారు.