కడప జిల్లా, గుర్రంకొండ పరిధిలోని నబీకాలనీ, పోలేరమ్మవీధి, కొత్తపేట, మహ బూబ్‌నగర్, జీవనతోపురోడ్డు, రామాలయం ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రవేశ పెట్టిన మినీ మేనిఫెస్టో ని ప్రజలకి వివరించారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ... ప్రజలంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని టీడీపీని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన ,టీడీపీ అధికారం లోకి వస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది అని తెలియజేసారు.