రాప్తాడు ఎమ్మెల్యే, ఎక్ప్ప్ నాయకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై చంద్రబాబు మండిపడ్డారు. ప్రోజెక్టుల సందర్శనలో భాగంగా ఆత్మకూరు మండలం సింగనగుట్ట వద్ద నిలిచిపోయిన జీడిపల్లి- అప్పర్‌పెన్నార్ ప్రాజెక్టు సప్లై చానల్ పంప్ హౌస్‌ను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ‘రూ.2 వేల కోట్లు కొట్టేసి.. సైకో అండచూసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావ్. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’ అని హెచ్చరించారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, కబ్జా చేసిన భూములు, ఆక్రమ ఆస్తులను కక్కిస్తామని అన్నారు. సీట్లు గెలిపించే బాధ్యత మీది.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసే బాధ్యత నాది’ అని ప్రజలతో అన్నారు.