ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు శుక్రవారం సర్పంచ్ వల్లూరు శివలక్ష్మి వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గర్భవతులకు సీమంతాల కార్యక్రమం నిర్వహించి వారికి పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.