మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ముగ్గురు మరణించారు. కుకీ వర్గానికి చెందిన పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతానికి వచ్చారని, వారిపై కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. మృతులు క్వాక్తా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.