జగనన్న కాలనీలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని ఓబులవారిపల్లి మండలం అభివృద్ధి అధికారి విజయా రావు కోరారు. శుక్రవారం గృహ నిర్మాణ శాఖ డిఈ కుప్పు స్వామి మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జగనన్న ఇండ్లు నిర్మాణ దశలో ఉన్న వాటిని గమనించి లబ్ధిదారులకు రుణాల ద్వారా తాత్కాలిక సహాయం 25 వేలు, డ్వాక్రా రుణం 35 వేలు అందించి గృహాలను త్వరగా నిర్మించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.