బిజెపి ముస్లింలకు వ్యతిరేకం కాదని, కుల, మత, వర్గ, ప్రాంతీయ, లింగ బేధాలకు తావు లేకుండా సర్వ మానవ సౌభ్రాతృత్వం అన్న నినాదంతో ముందుకెళ్లడమే భారతీయ జనతా పార్టీ నినాదం అని, బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. శుక్రవారం రాజంపేట పార్లమెంటు కన్వీనర్, రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ సభ్యులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో మన్నూరు లోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.