అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..... తాడిపత్రి మండలం, రావి వెంకటంపల్లి గ్రామం వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి హైవేపై అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొన్నది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో కారు యజమాని మోహన్ రెడ్డితో పాటు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మద్యం మత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమాని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa