హిందీని ప్రధాన భాషగా ఎంపిక చేసే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎప్పటికీ హిందీ భాషకు బానిసం కాబోమని అన్నారు. ప్రధాన భాష ఎంపిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ చెప్పారు. హిందీయేతర భాషలు మాట్లాడేవారిని లొంగదీసుకునే ప్రయత్నమే ఇది అని అన్నారు.