అమృత్ భారత్ పథకం కింద తొలి విడతలో ఏపీలో రూ.453 కోట్లతో 18 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ వర్చువల్గా ఆదివారం శంకుస్థాపన చేస్తారు. తొలిదశలో అనకాపల్లి, భీమవరం టౌన్, దొనకొండ, దువ్వాడ, ఏలూరు, కాకినాడ జంక్షన్, కర్నూలు సిటీ, నరసాపూర్, నిడదవోలు జంక్షన్, ఒంగోలు, పలాస, పిడుగురాళ్ల, రేపల్లె, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని, విజయనగరం స్టేషన్లు అభివృద్ధి కానున్నాయి.