పబ్జీ ఆడుతూ మానసిక నియంత్రణను కోల్పోయిన కొడుకు తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీ పట్టణంలో చోటు చేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్ (60) అతని భార్య విమల (51) కుమారుడు అంకిత్ (28) జాన్సీ పట్టణంలో నివాసముంటున్నారు. పబ్జీ ఆటకు బానిసైన అంకిత్.. గేమ్ ఆడొద్దని చెప్పినందుకు తల్లిదండ్రులపై దాడి చేశాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని అంకిత్‌ను అరెస్ట్ చేశారు.