గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటన లో భాగంగా రాజమహేంద్రవరం వెళ్లిన సీఎం జగన్ పెద్ద మనస్సు చాటుకున్నారు. కొవ్వూరు మండలం సీతం పేటకు చెందిన నాగలక్ష్మి, గోవింద్ దంపతుల కుమార్తె లక్ష్మి రేణుక బైలేర్టల్ నాడ్యులర్ వ్యాధి (ఊపిరి తిత్తుల సమస్య) తో బాధపడుతున్నట్లు తెలియచేసి, తమ పాప వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేమని , తమ కుమార్తె కు వైద్య కోసం అభ్యర్థించారన్నారు. స్పందించిన సీఎం జగన్ తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయల అందించి పాపకు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని ఆదేశించడం జరిగిందని, ఆమేరకు లక్ష్మి రేణుక తల్లి నాగమణి కు లక్ష రూపాయలు చెక్కు అందించినట్లు కలెక్టర్ మాధవి లత తెలిపారు.