వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం వైయస్ జగన్.. సోమవారం అల్లూరి జిల్లా, కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్ఐ వెంకటేశన్‌ను సీఎం అభినందించారు. సీఎం వైయస్ జగన్ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్ఐ వెంకటేశన్‌కు పోలీస్ మెడల్ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారు.