ఉద్యోగం లేక మన స్తాపం చెందిన దొడ్డి శ్రీను (34) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఏడీ సమీప గవరవీధిలో నివాసం ఉంటున్న శ్రీను డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భార్య ఒక ప్లే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. శ్రీను గత కొంత కాలంగా ఉద్యోగం లేక బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య పలుమార్లు తలుపు కొట్టినా తీయ కపోవడంతో కిటికిలోంచి చూడగా శ్రీను ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్నాడు.