104 ఏరియా బాపూజీనగర్ ప్రధాన రహదారిలో కాలనీకి ఆనుకొని ఉన్న లక్ష్మీనరసింహ థియేటర్‌కు వచ్చిన ప్రజలు తమ వాహనా లను నిలిపి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని సోమవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో కాలనీ అధ్యక్ష, కార్యదర్శిలు అన్నంనాయుడు, రామారావు ఫిర్యాదు చేశారు. దీనివల్ల రాక పోకలు సాగించేందుకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.