విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం కలెక్టరేట్ల వద్ద కార్మికులను రెగ్యులర్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం, పనిముట్లు, రక్షణ పరికరాలు, హెల్త్ అలవెన్సులు, ప్లాంటేషన్ కార్మికుల బకాయిలు, వాహనాల డ్రైవర్లకు రూ.18,500 వేతనం, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోమవారం మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేశారు. సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకుంటే 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.