చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో తొమ్మిదిమంది దాతలు విరాళాలకు సంబంధించిన రూ.5.11 కోట్ల డీడీలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణరోడ్డులో ఆలయ విస్తరణ కోసం స్థలం కోనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై స్థానిక మండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలు కు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు. సోమవారం ర్యాపిడ్‌కేర్ గ్రూప్ తరపున రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యం, నాగరాజన్, సీఆర్ కన్స్ట్రక్షన్స్ రూ.కోటి చొప్పున 3 కోట్లు, శ్రీశరణ్, శెంబగమూర్తి రూ.20 లక్షల చొప్పున 40లక్షలు, నరేష్ సుబ్రహ్మణ్యం, బలహా కెమికల్స్ లిమిటెడ్ రూ.10 లక్షల చొప్పున, నీలాద్రి ప్యాకింగ్స్ తరపున రూ.లక్ష విరాళంగా అందించారు.