ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే టీటీడీ చైర్మన్ పదవికి న్యాయం చేయగలరన్నారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందని పురందేశ్వరి అన్నారు. ఈ విషయంపై గళం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడంతో జరిగిందన్నారు. అంటే ఈ ప్రభుత్వం నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలగానే పరిగణిస్తున్నారని అర్థమవుతుందన్నారు. కనుక టీటీడీ చైర్మన్ పదవిలో హిందూ ధర్మం అనుసరించే వాళ్ళను నియమించాలని దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.