ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్లు ధరించాలని ఒకటవ పట్టణ సీఐ రామ సుబ్బయ్య సూచించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ కూడలిలో సీఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ మార్గంలో హెల్మెట్లు లేకుండా వెళుతున్న వాహనదారులను నిలిపి వేశారు. అక్కడ అందరినీ సమావేశ పరచి హెల్మెట్లు వాడకంపై అవగాహన కల్పించారు. ఒక్క నిర్లక్ష్యం నిండు ప్రాణం బలిగొంటుందని అన్నారు. ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.