విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది ఉద్యమాలతోనే సాధ్యం అవుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. గుంతకల్లు పట్టణంలో రెండు రోజులపాటు జరుగనున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో భాగంగా మంగళవారం వేలాది మంది కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఉపాధ్యక్షులు సి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.