ధర్మవరం పట్టణంలోని 25 వ వార్డు పార్థసారథి నగర్ కు చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు ఇటీవల ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో రోడ్లు వేయాలని కోరింది. అయితే ఆమెకు ప్రభుత్వం అందించే పింఛన్ ను తొలగించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దృష్టికి ఆ వృద్ధురాలు తీసుకెళ్లింది. స్పందించిన మధుసూదన్ రెడ్డి ప్రతినెలా జనసేన పార్టీ తరఫున పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు.