పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం పైడేటి గ్రామంలో మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి కె. పార్థసారథి ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలను వివరిస్తూ కరపత్రాలను మహిళలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.