రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. రేపు పెన్ డౌన్ మరియు మొబైల్ ఫోన్ పనిచేయవుఫోన్ డౌన్ చేయనున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులకు దూరంగా ఉంటారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనల దృష్ట్యా విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు.