ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో బుధవారం ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో కొంచెం అహంకారం ఉండేదని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేపట్టానని, పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని పేర్కొన్నారు. జోడో యాత్ర తన అహంకారాన్ని పోగొట్టిందన్నారు.