కశ్మీర్ లోయలో పండితులను వెంటాడి వేధించిన శక్తుల గురించి మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ కుటుంబానికి ఉందా? అని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరారు. ‘పారిపోండి లేదా మతం మారండి.. లేదా మా చేతుల్లో చచ్చిపోండి’ అంటూ అక్కడివారిని హెచ్చరిస్తూ.. కశ్మీర్ మసీదుల నుంచి వినిపించిన బహిరంగ హెచ్చరిక సమయంలో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.