కావలసిన పదార్థాలు
గోధుమపిండి: ఒక కప్పు, తరిగిన కరివేపాకు: అర కప్పు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: పావు టీస్పూన్, ధనియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: సరిపడినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె, తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లి కాస్త గట్టిగా ముద్ద చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. పిండి ముద్దను చపాతీలా ఒత్తి చాకుతో కావాల్సిన పరిమాణంలో ముక్కలు చేసి పెట్టుకోవాలి. వీటిని కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే కరకరలాడే కరివేపాకు చెక్కలు సిద్ధం.