అనంతపురం నగరంలో వర్షాల వల్ల ఎక్కడా డ్రైనేజీ నీరు రోడ్ పైకి రాకుండా కాలువలలో పూడికతీతపై దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. గురువారం సప్తగిరి సర్కిల్ లో జరుగుతున్న డ్రైనేజీలలో పూడికతీత పనులను వసీం పరిశీలించారు. మేయర్ వసీం మాట్లాడుతూ వర్షాలకు డ్రైనేజీలు పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహించే అవకాశం ఉంటుందని కాలువల్లో బురద తొలగింపు పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.