చంద్రబాబును అరెస్టు చేస్తే రాష్ట్రం అల్లకల్లోమవుతుందని తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్ హెచ్చరించారు. మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు సభల వద్దకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అల్లరి మూకలను పంపి రాళ్లతో దాడులు జరిపించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులపై ఎదురు కేసులు పెట్టించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని చంద్రబాబు బట్టబయలు చేస్తున్నారనే బాధతోనే చంద్రబాబుపై దాడి జరిపారు. పులివెందులలో చంద్రబాబు సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో తట్టుకోలేక చంద్రబాబు సభ లకు భంగం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోంది. రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నగర అధ్య క్షుడు ఎండీ ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, తలారి సోమశేఖర్, మోటమర్రి బాబా ప్రసాద్, పంచపర్వాల కాశీవిశ్వనాథం, మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత, దింట కుర్తి సుధాకర్, వర్మ, లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.