వైజాగ్‌లోని జగదాంబ సెంటర్లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.ప్రశాంతమైన విశాఖ నగరం ఇవాళ గూండాదారులు, కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో విలవిల్లాడుతోందని అన్నారు. ఈ మేరకు విశాఖ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలకు అండగా నిలుస్తాను.మిమ్మల్ని బెదిరించే గూండాల కాళ్లు విరగ్గొట్టి, తోలు తీసే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. సీఎం జగన్ ఉదయం పథకం కింద డబ్బులిస్తూ.. సాయంత్రం సారా కింద పట్టుకుపోతున్నారని అన్నారు.